: బొగ్గు స్కాంలో దాసరి పాత్ర ఉందంటోన్న సీబీఐ
లక్షా 86 వేల కోట్ల రూపాయల మేర గోల్ మాల్ జరిగిన బొగ్గు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు పాత్ర ఉందని సీబీఐ విశ్వసిస్తోంది. ఆయన గనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది. దాసరి హయాంలోనే కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ కు చెందిన కంపెనీలకు 11 బ్లాక్ ల బొగ్గును కేటాయించారు. ఈ క్రమంలో జిందాల్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చిన సీబీఐ ఆయనపై ఫోర్జరీ, ఛీటింగ్ అభియోగాలను మోపింది. కాగా, ఈ స్కాంలో సీబీఐ తాజా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ 12వది. ఇంతకుమునుపు ఓసారి దాసరిని సీబీఐ ప్రశ్నించినా.. ఎన్నడూ ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు. కానీ, ఈసారి పక్కా ఆధారాలతోనే దాసరి పేరును ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.