: బాలీవుడ్ కి వర్షం దెబ్బ
తోటి హీరోలతో ఢీ కొట్టాల్సిన బాలీవుడ్ హీరోలు వర్షం దెబ్బకు కుదేలవుతున్నారు. ముంబైలో ఆగకుండా కురుస్తున్న వర్షాలు చాలా సినిమాల షూటింగులకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. వర్షం దెబ్బకు ఇబ్బంది పడుతున్న వారిలో ఇమ్రాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, వరుణ్ ధావన్ వంటి తారలు ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్, కరీనాకపూర్ సినిమా 'గోరీ తేరే ప్యార్ మెయిన్', సుభాష్ ఘై 'కాంచి', అక్షయ్ కుమార్ - విపుల్ షా ప్రొడక్షన్ సినిమాల షూటింగులు వర్షం కారణంగా వాయిదా పడి నష్టాల పాలవుతున్నాయి. 'షూటింగ్ ఆపాలని అనుకోవడం లేదు. కానీ జనరేటర్లు, ఇతర పరికరాలను స్పాటుకు తీసుకురావడం అస్సలు కుదరడం లేదు' అంటూ వాపోతున్నారు విపుల్ షా.