జ‌మ్మూలో ఎన్‌కౌంట‌ర్‌... భార‌త జ‌వాన్ వీర మ‌ర‌ణం

   
జ‌మ్మూక‌శ్మీర్‌లోని బ‌సంత్‌గ‌ఢ్‌లో జ‌రుగుతున్న ఎన్‌కౌంట‌ర్‌లో ఓ ఆర్మీ జ‌వాన్ మృతిచెందారు. అక్క‌డ ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే విశ్వ‌స‌నీయ స‌మాచారంతో బ‌ల‌గాలు కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. దీంతో ముష్క‌రులు ఎదురు కాల్పులు జ‌రిపారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఆర్మీ జ‌వాన్ వీర మ‌ర‌ణం పొందార‌ని భ‌ద్ర‌తా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

ప్ర‌స్తుతం అక్క‌డ భీక‌ర ఎన్‌కౌంట‌ర్ జ‌రుగుతోంది. బేస్ క్యాంపుల నుంచి భారీ మొత్తంలో స్పాట్‌కు అద‌న‌పు బ‌ల‌గాల‌ను ఆర్మీ అధికారులు త‌ర‌లిస్తున్నారు. మ‌రోవైపు క‌శ్మీర్ ప‌ర్యాట‌క రంగం ప‌రిర‌క్ష‌ణ‌కు కేంద్రం చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. 

ఇక‌, తాజా ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ప‌ర్యాట‌క ప్రాంతాల్లో భ‌ద్ర‌త అవ‌స‌ర‌మ‌ని ఉన్న‌తాధికారులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివ‌రించారు. దాంతో ఆర్మీ, పారా మిల‌ట‌రీ బ‌ల‌గాల‌ను అన్ని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాల్లో శాశ్వ‌తంగా మోహ‌రిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.   




More Telugu News