: 'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' అంటోన్న డీఎల్


డీఎల్ రవీంద్రారెడ్డి.. కడప జిల్లాకు చెందిన ఈ విలక్షణ రాజకీయనాయకుడు తనకు నచ్చకపోతే ఎంతటి నేతనైనా ఎదిరిస్తారు. ఆ విధంగానే సీఎం కిరణ్ తోనూ మాటల యుద్ధానికి తెరదీసి.. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు, ఇటీవలే మంత్రి పదవిని ఊడగొట్టుకున్నారు. ఆ విషయం అటుంచితే, శాసనసభ సమావేశాల రెండోరోజున ఈయనకు అసెంబ్లీలో 79వ నెంబర్ సీటు కేటాయించడం వివాదాస్పదమైంది. 'ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికై, అపార అనుభవం సంపాదించిన నాకు.. ఎక్కడో మారుమూల సీటు చూపిస్తారా?' అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులను ఈ విషయమై ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News