: వాస్తు బాగుంటే..అవినీతి నేతలకి పండగే: జైపాల్ రెడ్డి


ఈ మాటలన్నది..ఎవరో సాధారణ వ్యక్తి కాదు..సాక్షాత్తు..కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి. అవును. సాధారణ ప్రజల కంటే రాజకీయ నాయకులకే మూఢ నమ్మకాలు ఎక్కువని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూఢ నమ్మకాలపై అపోహలను తొలగిస్తూ జనవిజ్ఞాన వేదిక 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రజతోత్సవంలో జైపాల్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రభుత్వం ఇచ్చే క్వార్టర్లలో ముందుగా వాస్తును చూసుకుంటున్నారని అన్నారు. ఎందుకంటే.. 
వాస్తు బాగున్న ఇల్లైతే ఎంత అవినీతి చేసినా పర్లేదని ప్రస్తుత నేతల నమ్మకమని జైపాల్ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. ప్రజల్లో మూఢనమ్మకాలను సమూలంగా తొలగించేందుకు మరింత కృషి చేయాలని ఆయన జనవిజ్ఞాన వేదిక సభ్యులకు సూచించారు.

  • Loading...

More Telugu News