: ధోనీని ప్రశ్నించనున్న బీసీసీఐ


టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వాటాలపై బీసీసీఐ దృష్టి సారించింది. రితి స్పోర్ట్స్ కంపెనీలో ధోనీకి 15 శాతం వాటాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అతడిని బీసీసీఐ ప్రశ్నించనుంది. ధోనీపై వస్తున్న ఆరోపణలను బోర్డు పరిశీలిస్తోందని తాత్కాలిక అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా తెలిపారు. చాంపియన్స్ ట్రోఫీలో ఉన్న జట్టును కలతపెట్ట దలచుకోలేదని, ఈ అంశం తమ పరిశీలనలో ఉందని చెప్పారు. ఇక, తాజా వివాదాల నేపథ్యంలో ఐపిఎల్ క్రికెటర్లు తమ వ్యక్తిగత ఆదాయం వివరాలు వెల్లడించేలా కోరాలని బీసీసీఐ భావిస్తోంది. ఇంగ్లండ్ లో ఉన్న భాతర జట్టు చాంపియన్స్ ట్రోఫీ అనంతరం వెస్టిండీస్, జింబాబ్వే టూర్లను పూర్తి చేసుకుని ఆగష్టులో భారత్ కు తిరిగివస్తుంది.

  • Loading...

More Telugu News