గుడ్ ఫ్రైడే సందర్భంగా జగన్ సందేశం

  • ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్న క్రైస్తవులు
  • జీసస్ చేసిన త్యాగాన్ని గుడ్ ఫ్రైడే రోజున గుర్తు చేసుకుంటామన్న జగన్
  • జీసస్ మానవాళికి ఇచ్చిన సందేశం ప్రేమ, కరుణ, త్యాగమన్న జగన్
ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... మానవాళి కోసం జీసన్ చేసిన అంతిమ త్యాగాన్ని గుడ్ ఫ్రైడే రోజున మనం గుర్తు చేసుకుంటామని చెప్పారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం... ఇదే జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశమని అన్నారు. కరుణామయుడు ఏసు క్రీస్తును శిలువ వేసిన రోజును క్రైస్తవులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే.


More Telugu News