దానిమ్మతో బోలెడు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. అవేంటో తెలిస్తే అస్స‌లు వ‌దిలి పెట్ట‌రు!

  
దానిమ్మ పండుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు,  ఖనిజాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్ర‌తిరోజూ తినడం వల్ల‌ దానిమ్మతో కలిగే ఐదు అద్భుత‌మైన ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

గుండె ఆరోగ్యం..
దానిమ్మ గింజ‌ల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ర‌క్త ప్ర‌సారాన్ని మెరుగు ప‌రిచి, రక్తపోటును తగ్గిస్తాయి. త‌ద్వారా హృదయ ఆరోగ్యం మెరుగువుతుంది. 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది..
దానిమ్మ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విట‌మ‌న్ సీ, ఇత‌ర పోష‌కాలు రోగనిరోధక శక్తిని బ‌లోపేతం చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే శ‌రీరం త‌ర‌చూ ఇన్ఫెక్షన్ల బారిన ప‌డ‌కుండా రక్షిస్తుంది. 

జీర్ణక్రియ మెరుగ‌వుతుంది..
దానిమ్మ గింజల్లో ఫైబర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. త‌ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

చర్మ ఆరోగ్యం..
దానిమ్మ పండు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దానిమ్మ క‌లిగే ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. త‌ద్వారా చర్మం ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది. అకాల వృద్ధాప్యాన్ని దూరం చేయ‌డంలో సహాయపడుతుంది. 

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిని నియంత్రిస్తుంది..
దానిమ్మ గింజ‌లు త‌క్కువ స్థాయిలో గ్లైసెమిక్ ను క‌లిగి ఉంటాయి. అందుకే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డానికి స‌హ‌య‌ప‌డుతుంది. ఇది మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తుల‌కు దివ్య ఔష‌ధం అన‌డంలో ఎలాంటి సందేహంలేదు. 




More Telugu News