: దాసరి నివాసంలో సీబీఐ సోదాలు
ఏళ్ళనాటి బొగ్గు కుంభకోణం దర్శకరత్న దాసరి నారాయణరావును వెంటాడుతోంది. ఈరోజు ఉదయం బొగ్గు స్కాంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ దేశవ్యాప్తంగా పలుచోట్ల సోదాలకు తెరదీసింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని దాసరి నివాసంలోనూ సోదా చేస్తోంది. నగరంలోని రెండు కంపెనీల్లోనూ ఆధారాల కోసం వెతుకుతున్నట్టు సమాచారం. కాగా, ఎఫ్ఐఆర్ లో సీబీఐ.. దాసరితోపాటు పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ పేరునూ చేర్చింది.