: దాసరి చుట్టూ రాజుకుంటున్న 'బొగ్గు' మంట
దర్శకరత్న దాసరి నారాయణ రావు మెడకు బొగ్గు కుంభకోణం చుట్టుకుంటోంది. కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన సమయంలోనే బొగ్గు కుంభకోణం అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీఐ స్పష్టం చేసింది. సీబీఐ నేడు బొగ్గు స్కాంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బొగ్గు నిల్వలను దుర్వినియోగం చేసారని ఆరోపణలు చేస్తూ.. ఈ క్రమంలో దాసరి పేరునూ ఎఫ్ఐఆర్ లో చేర్చింది. కాగా, దాసరిని సీబీఐ ఇంతకుముందోసారి విచారించిన సంగతి తెలిసిందే.