: కొడుకును దండించినందుకు శిక్ష తప్పదు: నార్వే
అనుపమ దంపతులకు శిక్షను మాఫీ చేయాలని కోరుతూ నార్వే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన ఫలించలేదు. "కొడుకును దండించినందుకు మా చట్టాల ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. చట్టాలు మార్చడం కుదరదు, వారిని జైలు నుంచి విడుదల చేయలేం" అంటూ నార్వే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ లేఖకు జవాబు ఇచ్చింది. కొడుకును దండించిన కేసులో వల్లభనేని చంద్రశేఖర్ కు 18 నెలలు, ఆయన భార్య అనుపమకు 15 నెలలపాటు నార్వే కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.