మాజీ మంత్రి కాకాణికి హైకోర్టులో షాక్

  • క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసు
  • కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
  • క్వాష్ పిటిషన్ పై విచారణ 2 వారాలకు వాయిదా
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ముందస్తు బెయిల్ ను నిరాకరించింది. పోలీసుల అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన మరో పిటిషన్ (క్వాష్ పిటిషన్)పై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.


More Telugu News