: బాంబుల మోతతో దద్దరిల్లిన ఇరాక్


బాంబుల మోతతో ఇరాక్ దద్దరిల్లింది. మధ్య ఇరాక్ జిదైదత్ అల్ షత్ పట్టణంలో రద్దీగా ఉన్న మార్కెట్ లో తీవ్రవాదులు పేల్చిన కారుబాంబు ధాటికి అక్కడి రోడ్డు నెత్తురోడింది. పేలుడు ధాటికి మాంసం ముద్దలు ఎగిరిపడ్డాయి. 15 మంది అక్కడికక్కడ అసువులు బాయగా, 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. పార్కింగ్ చేసిన కార్లలో అమర్చిన 3 బాంబులు ఒకదాని తరువాత ఒకటిగా పేలడంతో ఈ దారుణం తీవ్రత ఎక్కువగా ఉంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. దీనికి బాధ్యులమంటూ ఏ సంస్థ ఇప్పటి వరకు ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News