: వారంలో 100 కోట్లు వసూలు చేసిన 'యే జవానీ హై దివానీ'
క్రేజీ కపుల్ రణబీర్ కపూర్, దీపికా పదుకునే నటించిన 'యే జవానీ హై దివానీ' సినిమా సంచలనం సృష్టిస్తోంది. వారం రోజుల్లో 100 కోట్లు వసూలు చేసి రణబీర్ ను సూపర్ స్టార్ ను చేసేసింది. ఇప్పటి వరకూ వారం రోజుల్లో వంద కోట్లు వసూలు చేసిన సినిమాగా సల్మాన్ ఖాన్ సినిమా 'ఏక్ థా టైగర్' సినిమా రికార్డుల కెక్కితే, దాని తరువాతి స్థానం 'యే జవానీ హై దీవానీ'దే. 2007 లో రిషీకపూర్ నటవారసుడిగా తెరంగేట్రం చేసిన రణబీర్ కపూర్ పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు కానీ, ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసాడు. 30 ఏళ్ల రణబీర్ కపూర్ ఒక్కో సినిమాకు 15 కోట్ల భారీ పారితోషికంతో పాటూ సినిమా లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నాడు. మంచి భవిష్యత్తున్న రణబీర్ మరో 20 ఏళ్లపాటు సినీపరిశ్రమను ఏలేస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.