ఐపీఎల్-2025 సీజ‌న్‌కు కేకేఆర్ కొత్త జెర్సీ... ఇదిగో వీడియో!

  • ఈ నెల 22 నుంచి ఐపీఎల్-2025 సీజ‌న్ ప్రారంభం
  • ఈ సీజ‌న్‌కు సంబంధించి తమ కొత్త జెర్సీని ఆవిష్కరించిన‌ కేకేఆర్ 
  • జెర్సీ లాంచ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్న ఫ్రాంచైజీ
  • ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వీడియో వైర‌ల్
ఐపీఎల్-2025 సీజ‌న్ మ‌రో 19 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే నిర్వాహకులు షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 18వ సీజ‌న్‌ జరగనుంది. మొత్తం 13 వేదిక‌ల్లో 74 మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి. 

ఇక ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా తలపడనున్నాయి.

ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 సీజన్ కు ముందుగా కేకేఆర్ ఫ్రాంచైజీ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన జెర్సీ లాంచ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. 

ఈ వీడియోలో కోల్‌క‌తా ఆటగాళ్లు వెంకటేశ్‌ అయ్యర్, రింకూ సింగ్, అజింక్య‌ రహానేతో పాటు ఇత‌ర ప్లేయ‌ర్లు కొత్త జెర్సీని ధరించి కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది.


More Telugu News