: బలిపశువునయ్యా: రాజ్ కుంద్రా ఆక్రోశం
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో తనను బలిపశువును చేశారని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, రాజస్థాన్ రాయల్స్ సహయజమాని రాజ్ కుంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులతడక నివేదిక ఆధారంగా తనపై సస్పెన్షన్ వేటు వేయడం పట్ల ఆయన నేడు స్పందించారు. ఈ విషయంలో తాను బీసీసీఐతో న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. భారత న్యాయవ్యవస్థపై నమ్మకముందని తెలిపారు. కాగా, కుంద్రాకు బ్రిటీష్ పౌరసత్వం ఉంది.