: సఫారీ క్రికెటర్ పార్నెల్ పై డిప్యుటీ చార్జిషీటు


రేవ్ పార్టీలో మత్తు పదార్ధాలు తీసుకున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షణాఫ్రికా క్రికెటర్ వేన్ పార్నెల్ పై ముంబై పోలీసులు అనుబంధ ఛార్జీషీటు దాఖలు చేసారు. గత మార్చిలో జూహూ ప్రాంతంలోని ఓ హోటల్ లో జరిగిన రేవ్ పార్టీలో టీమిండియా క్రికెటర్ రాహుల్ శర్మతో పాటు పార్నెల్ మత్తుపదార్ధాలు తీసుకున్నారంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చ్ 6 న ముంబై పోలీసులు దాఖలు చేసిన తొలి ఛార్జిషీటులో అతను పరారీలో ఉన్న నిందితుడుగా పేర్కొన్నారు. దీంతో అతను ఏప్రిల్ లో కోర్టుకు లొంగిపోయాడు. అనంతరం కోర్టు అతనికి బెయిలు మంజూరు చేసింది. ఇదే కేసులో రాహుల్ శర్మతో పాటు నటులు అపూర్వ, శిల్పా అగ్నిహోత్రి కూడా నిందితులుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News