: ఇండియా మ్యాప్ సృష్టికర్త విగ్రహం నిర్లక్ష్యం


భారత దేశం రూపురేఖలు గీసిన వ్యక్తి పేరు మీకు తెలుసా? ఇప్పుడంటే ఇంటర్నెట్ గూగుల్ మ్యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇవేమీ అందుబాటులో లేనప్పుడు, మ్యాపులు, గ్లోబు మన దేశం ఎలా ఉండేదో తెలిపేవి. భారతదేశ నైసర్గిక స్వరూపం అందుబాటులోకి ఎలా వచ్చిందో తెలిపిన వ్యక్తి విగ్రహం చెన్నైలో నిర్లక్ష్యానికి గురవుతోంది. చెన్నైలోని సెయింట్ ధామస్ లో ఓ పెద్ద మర్రి చెట్టు కింద ఓ మూలకు లామ్టన్ విగ్రహం మనకు దర్శనమిస్తుంది.

బ్రిటిష్ సైనికుడు, భూగోళ శాస్త్రవేత్త అయిన లామ్టన్, లార్డ్ వెస్లీ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు దక్షిణ భారతాన్ని సర్వే చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. వెస్లీ ట్రిగ్నామెట్రికల్ సర్వే నిర్వహించేందుకు విలియం లామ్టన్ ను సూపరిండెంట్ గా నియమించారు. ప్రక్కనే ఉన్న చిన్న కొండను ఆధారం చేసుకుని లామ్టన్ సెయింట్ ధామస్ లో వ్యూహాత్మక రేఖను గీసాడు. దీని ఆధారంగా కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకూ స్కేలింగ్ ఇవ్వగలిగారు. అంతటి మహావ్యక్తి విగ్రహం పాడైపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చరిత్రకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News