: భారత్ దూకుడును అడ్డుకుంటాం : బ్రావో


టీమిండియాను నిలువరించగలిగే సత్తా తమకుందంటున్నాడు వెస్టిండీస్ కెప్టెన్ డ్వేన్ బ్రావో. డారెన్ సమీ నుంచి విండీస్ సారధ్య బాధ్యతలందుకున్న బ్రావో రేపు భారత్ తో జరగనున్న మ్యాచ్ కు అస్త్రాలు సిద్ధం చేసుకున్నామంటున్నాడు. 'భారత్ బ్యాటింగ్ చాలా పటిష్ఠంగా ఉందనే విషయం నాకు తెలుసు. కానీ వారి దూకుడుకు అడ్డుకట్ట వేయగల బౌలర్లు మాకు ఉన్నారు. పాకిస్తాన్ జట్టును అతి తక్కువ స్కోరుకే ఔట్ చేయడంతో ఆ విషయాన్ని చాటి చెప్పగలిగాం' అంటున్నాడు బ్రావో. కాగా, బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగా ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగంలో భారత జట్టు ఆశించినంత సమర్ధంగా లేదని చెప్పుకోవచ్చు. క్రిస్ గేల్, పొలార్డ్, శామ్యూల్స్ వంటి మ్యాచ్ విన్నర్లను ఎదుర్కోవడం అంత సులభం కాదు.

  • Loading...

More Telugu News