: అద్వానీ రాజీనామా చేస్తే.. మనకేంటి: చంద్రబాబు
బీజేపీ అగ్రనేత అద్వానీ రాజీనామా వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజీనామా వ్యవహారం బీజేపీ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. ఇక ఇంతటి ఉపద్రవానికి కారణమైన మోడీ గురించి మాట్లాడుతూ.. ఆయన ప్రభావం రాష్ట్రంపై ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. ఇంతక్రితం టీడీపీ అమలు చేసిన పథకాలనే మోడీ గుజరాత్ లో ప్రవేశపెట్టి విజయవంతం అయ్యాడని బాబు వివరించారు. ఇక, రాష్ట్రంలో బీజేపీ పుంజుకునే పరిస్థితి కనిపించడంలేదని అభిప్రాయపడ్డారు.