: అద్వానీ రాజీనామా తిరస్కరించిన పార్టీ అధ్యక్షుడు


బీజేపీ అగ్రనేత, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీ నేడు రాజీనామా చేయగా.. ఆయన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తిరస్కరించారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి పార్టీ వ్యవహారాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొంతకాలంగా గుర్రుగా ఉంటోన్న అద్వానీకి.. మోడీకి ప్రచార కమిటీ పగ్గాలు అందించడం పుండు మీద కారం చల్లినట్టయింది. దీంతో, పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్టు అద్వానీ ఈ మధ్యాహ్నం ప్రకటించారు.

  • Loading...

More Telugu News