: మోడీపై మా నిర్ణయం త్వరలోనే చెబుతాం: నితీశ్ కుమార్


నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై సాధ్యమైనంత త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని జేడీ-యూ నేత నితీశ్ కుమార్ చెప్పారు. మోడీ ప్రాబల్యాన్ని ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎన్డీయే నేతల్లో ఈ బీహార్ ముఖ్యమంత్రి ఒకరు. పార్టీలో మోడీ వ్యవహారంపై అన్ని కోణాల్లో చర్చించిన తర్వాతే నిర్ణయం చెబుతామని నితీశ్ అన్నారు. పాట్నాలో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, మోడీని బీజేపీ ప్రచార సారథిగా నియమించడానికి ముందు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తనను ఫోన్ లో సంప్రదించినట్టు వచ్చిన వార్తలను నితీశ్ ఖండించారు. అయినా, మోడీ నియామకం బీజేపీ అంతర్గత వ్యవహారమని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News