: తాడో పేడో తేల్చేస్తాం: కోదండరాం


ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీజేఎసీ సిద్దమౌతోంది. ఈనెల 14 న నిర్వహించనున్న ఛలో అసెంబ్లీకి అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా ఆ కార్యక్రమం నిర్వహించి తీరుతామని టీజేఏసీ కన్వీనర్ కోందండరాం స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 13, 14 తేదీలలో ఇందిరా పార్కులో ధర్నా నిర్వహించేందుకు డీసీపీకి వినతిపత్రం ఇచ్చామని, అయితే అందుకు సానుకూల స్పందన కన్పించడం లేదని, ఛలో అసెంబ్లీ కార్యక్రమంపై పునరాలోచించుకోవాలని డీసీపీ కోరారని కోదండరాం తెలిపారు. తెలంగాణపై ప్రభుత్వం తక్షణం సానుకూలంగా నిర్ణయం తీసుకుని పార్లమెంటులో బిల్లు పెడితేనే ఛలో అసెంబ్లీ వాయిదా వేసుకుంటామని, లేకుంటే లక్షలాదిగా తరలివచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News