: బీసీసీఐ ట్రెజరర్ గా 'ముంబయివాలా'కు అవకాశం


భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో ఉత్తరాది లాబీయింగ్ పవరేంటో మరోసారి నిరూపితమైంది. నాలుగురోజుల క్రితం బీసీసీఐ కోశాధికారిగా తెరపైకి వచ్చిన కర్ణాటక క్రికెట్ సంఘానికి చెందిన వెంకటేశ్ తల్లమ్ కు నిరాశే మిగిలింది. నిబంధనలు అనుకూలించవంటూ అతని స్థానంలో ముంబయి క్రికెట్ సంఘానికి చెందిన రవి సావంత్ ను ట్రెజరర్ గా నియమిస్తూ నేడు బోర్టు నిర్ణయం తీసుకుంది. సావంత్ ప్రస్తుతం ముంబయి క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా, బీసీసీఐ వార్షిక సమావేశాలకు ఒక్కసారి కూడా హాజరుకాలేదన్న నెపంతో వెంకటేశ్ ను ట్రెజరర్ పదవికి అనర్హుడని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News