: బీజేపీకి అద్వానీ రాజీనామా
బీజేపీలో సంక్షోభం ముదిరి పాకాన పడింది. మోడీ ప్రాబల్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అద్వానీ నేడు పార్టీకి రాజీనామా చేశారు. మోడీని వచ్చే ఎన్నికలకు ప్రచార సారథిగా నియమించడం పట్ల కినుక వహించిన ఈ సీనియర్ నేత పార్టీ పదవులన్నింటికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత కొంతకాలంగా గుజరాత్ సీఎం మోడీ పట్ల వ్యతిరేకత కనబరుస్తున్న అద్వానీ.. నిన్న ముగిసిన గోవా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకాకుండా తన వైఖరిని మరింత స్పష్టం చేశారు. ఓ దశలో మోడీని ప్రచార కమిటీ కన్వీనర్ గా నియమిస్తే తనకేమీ అభ్యంతరం లేదని చెప్పిన ఆయన.. పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ ప్రకటనతో ఖిన్నుడైనట్టు తెలుస్తోంది.