: చంపడానికని వెళ్ళి ఘోరంగా చచ్చారు!
ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. రాజధాని కాబూల్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై వారు దాడికి పాల్పడగా... ఈ దాడిలో పాల్గొన్న ఐదుగురు మిలిటెంట్లను భద్రత దళాలు మట్టుబెట్టాయి. మరో ఇద్దరు తమను తాము పేల్చేసుకున్నారు. వీరిద్దరినీ ఆత్మాహుతి దళ సభ్యులుగా భావిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు తీవ్రవాదులు హతమైనట్టు ఆఫ్ఘన్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. నాటో దళాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్టు ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సిద్ధిక్ సిద్ధికీ తెలిపారు. మిలిటెంట్లు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు, అస్సాల్ట్ రైఫిళ్ళతో ఈ దాడికి యత్నించారని ఆయన వెల్లడించారు.