: అక్షింతలు వేయడానికి రూ 3.5 కోట్లు తీసుకున్న సల్మాన్
దబాంగ్, ఏక్ థా టైగర్ వంటి విజయవంతమైన సినిమాలతో బాలీవుడ్ లో తిరుగులేని పాప్యులారిటీ సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్ ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఎంత పారితోషికం స్వీకరించాడో తెలిస్తే కళ్లు తిరగక మానవు! ఢిల్లీలో ఓ సంపన్నుల ఇంట జరిగిన వివాహ వేడుకలో తళుక్కున మెరిసేందుకు అక్షరాలా రూ. 3.5 కోట్లు అందుకున్నాడట. సల్మాన్ ఖానా మజాకా..!
ధనికుల ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సినీ తారలు డబ్బు డిమాండ్ చేయడం ఇదే కొత్త కాదు. ఇంతకుముందు కూడా కొందరు బాలీవుడ్ స్టార్లు పైకం పుచ్చుకుని వేడుకలకు విచ్చేయడం జరుగుతున్న తంతే!