: నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో సెల్ టవర్లు


రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు మెరుగుపరిచేందుకు సర్కారు సన్నద్ధమైంది. ఈ క్రమంలో మారుమూల అటవీప్రాంతాల్లో సైతం సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లు ఈ టవర్ల ఏర్పాటుతో మరింత శక్తిమంతం అవుతాయని పోలీసు శాఖ భావిస్తోంది. అటవీప్రాంతాల్లో సెల్ టవర్లులేని కారణంగా కూంబింగ్ కు వెళ్ళే భద్రత బలగాలు ఇన్ ఫార్మర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు ఇప్పటివరకు ఇబ్బందులెదుర్కొన్నారు.

ఖమ్మం-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల వద్ద కమ్యూనికేషన్ పరంగా మెరుగ్గానే ఉన్నామని, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇన్ ఫార్మర్లతో మాట్లాడాలన్నా, మావోయిస్టు అగ్రనేతల ఫోన్లను ట్యాప్ చేయాలన్నా.. సెల్ టవర్లులేని కారణంగా వీలుచిక్కడంలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. అందుకే, పోలీసు శాఖ కష్టాలను అర్థం చేసుకున్న సర్కారు ఈ సంక్లిష్ట ప్రాంతాల్లో 227 టవర్లు ఏర్పాటు చేసేందుకు నడుంబిగించింది.

  • Loading...

More Telugu News