: రాజ్ కుంద్రాపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు
సొంత జట్టుపైనే పందేలు కాసిన రాజస్తాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసింది. స్పాట్ ఫిక్సింగ్ పై దర్యాప్తు పూర్తయ్యే వరకూ క్రికెట్ వ్యవహారాల్లో పాల్గొనకుండా రాజ్ కుంద్రాను సస్పెండ్ చేస్తూ ఢిల్లీలో జరిగిన బీసీసీఐ అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాజస్తాన్ రాయల్స్ పై రాజ్ కుంద్రా బెట్టింగులకు పాల్పడినట్లు తమ విచారణలో అంగీకరించారని ఢిల్లీ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, తానే తప్పూ చేయలేదని రాజ్ కుంద్రా ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.