: ముంబయిలో జనజీవనం అతలాకుతలం
ముంబయి మహానగరాన్ని భారీ వర్షాలు వరుసగా రెండో రోజూ ముంచెత్తాయి. దీంతో జనజీవనం స్థంభించింది. రోడ్లపై భారీగా నీరు ప్రవహిస్తుండడంతో ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఆకాశం మేఘావృతం కావడంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ళ షెడ్యూళ్ళను సవరించారు. ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలైన మలాడ్, అంధేరి, దాదర్, వెర్సోవా, పారెల్, చెంబూర్లో భారీగా వరదనీరు చేరింది. దీంతో, అక్కడి వాసులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నైరుతి రుతుపవనాలు ముంబయితో పాటు మహారాష్ట్ర తీరప్రాంతాన్ని చుట్టేసిన నేపథ్యంలో మరో రెండ్రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.