: విందూ సింగ్, మెయ్యప్పన్ మధ్య హోటల్ యజమాని!


సంచలనం సృష్టించిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో దర్యాప్తు ఊపందుకుంది. తాజాగా తమిళనాడు పోలీసులు కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. చెన్నైలో ఇంతకుముందు పలువురు బుకీలు అరెస్టు కాగా, వారితో సంబంధం ఉందని భావిస్తున్న హోటల్ యజమాని విక్రమ్ అగర్వాల్ ను తమిళనాడు సీబీసీఐడీ పోలీసులు విచారించనున్నారు. విక్రమ్ అగర్వాల్ ఈ ఉదయం సీబీసీఐడీ ముందు హాజరయ్యారు.

కాగా, బాలీవుడ్ నటుడు విందూ సింగ్ ను చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ గురునాథ్ మెయ్యప్పన్ కు పరిచయం చేసింది విక్రమ్ అగర్వాలే అని ముంబయి పోలీసులు ఈసరికే తేల్చారు. అయితే, ఈ ఆరోపణలను ఈ హోటల్ యజమాని తోసిపుచ్చినట్టు సమాచారం. విక్రమ్ కు చెన్నైలో రెండు హోటళ్ళు ఉండగా, వాటి నుంచే బుకీలు ఐపీఎల్ మ్యాచ్ లపై బెట్టింగ్ లు నిర్వహించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో విక్రమ్ నివాసం, కార్యాలయాలపై పోలీసులు సోదాలు జరిపారు.

  • Loading...

More Telugu News