: మోడీ మా మంచి మిత్రుడు: జయలలిత
నరేంద్ర మోడీ తనకు మంచి మిత్రుడని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. మోడీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులు కావడంపై విలేకరులు జయలలిత స్పందన రాబట్టే ప్రయత్నం చేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. అది బీజేపీ అంతర్గత వ్యవహారమన్నారు. "రాజకీయంగా వేరొక పార్టీ అంతర్గత విషయం గురించి మాట్లాడడం సరికాదు. అయితే, మంచి పరిపాలన దక్షతగల మోడీ నాకు చాలా మంచి మిత్రుడు" అని జయలలిత చెప్పారు.