: అయ్యో ... రూ'పాయే'!


రూపాయి మారకం విలువ జీవిత కాల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లో డాలర్ తో రూపాయి మారకం విలువ 57.76వద్ద ట్రేడవుతోంది. గతేడాది జూన్ లో నమోదైన 57.32 ఇప్పటి వరకూ అత్యంత కనిష్ఠ స్థాయిగా ఉంది. ఈ రోజు దానికంటే క్షీణించి రూపాయి సరికొత్త కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో ఈ నెల 18న జరగనున్న ఆర్ బీఐ త్రైమాసిక సమీక్ష సమావేశంలో రూపాయి విలువ క్షీణతకు అడ్డుకట్ట వేసే చర్యలను ప్రకటించే అవకాశం ఉంది. రూపాయి విలువ ఇలానే క్షీణిస్తే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దిగజారడంతోపాటు, దిగుమతి ఆధారిత ప్రైవేటు కంపెనీలపై పెను భారం పడుతుంది.

  • Loading...

More Telugu News