: అంబటి బ్రాహ్మణయ్యకు సభ సంతాపం
అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. రెండోవిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కష్టసమయంలో ఆయన కుటుంబ సభ్యులకు తామంతా తోడుగా ఉన్నామని ప్రకటించారు. టీడీపీ తరఫున చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున విజయలక్ష్మి కూడా సంతాపం తెలిపారు.