: ‘బ్రా’లను గుర్తించేందుకు మెటల్ డిటెక్టర్లు!
అక్కడ పరీక్ష హాలులో బ్రాలను వేసుకోవడం నిషేధం. దీంతో బ్రా వేసుకునే వారిని గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక 'బ్రా' డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. చైనాలో జాతీయ ప్రవేశ పరీక్షలో పాల్గొనే విద్యార్ధినులు తమ బ్రాలలో చిన్నపాటి కెమెరాలను పెట్టుకొని వచ్చి వాటిద్వారా ప్రశ్నపత్రాలను ఫోటోలు తీసి బయటనున్న తమ వారికి పంపడంతో పరీక్ష నిర్వాహకులు ఈ నిషేధం విధించాల్సి వచ్చింది.
చైనా జాతీయ పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్ధినులు బ్రాలను ధరించరాదని నిషేధం విధించారు. దీనికితోడు లోహపు బ్రాలు ధరించిన వారిని గుర్తించేందుకు వీలుగా పరీక్ష జరిగే పలు కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. శుక్ర, శని వారాల్లో జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ పరీక్షలో పాల్గొనే విద్యార్ధినులకు బ్రాలను నిషేధించడంతో చేసేది లేక రెండు చొక్కాలను వేసుకుని పరీక్షలో పాల్గొన్నట్టు విద్యార్ధినులు తెలిపారు. 2008లో కొందరు విద్యార్ధినులు చిన్న కెమెరాలను తమ బ్రాలలో పెట్టుకుని వచ్చి పరీక్ష పత్రాన్ని బయటికి పంపడంతో ఇప్పుడు ఇలాంటి నిషేధం విధించాల్సి వచ్చింది.