: తోకచుక్కల తాకిడివల్లే జీవం పుట్టిందట!


భూమిపైన జీవం ఆవిర్భావానికి సంబంధించిన విషయం శాస్త్రవేత్తలకు అంతుపట్టని రహస్యం. దీనిపై ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా కొందరు శాస్త్రవేత్తలు తోకచుక్కలు భూమిని ఢీకొట్టడం వల్లే భూమిపై జీవం ఆవిర్భవించిందని చెబుతున్నారు. దీనికి సంబంధించి వీరు కంప్యూటర్‌ నమూనాని ఆధారంగా చూపిస్తున్నారు.

కాలిఫోర్నియాలోని లారెన్స్‌ లివర్‌మోర్‌ లేబొరేటరీకి చెందిన పరిశోధకులు కంప్యూటర్‌ నమూనా ఆధారంగా ఒక అధ్యయనాన్ని చేపట్టారు. విశ్వం నుండి భూమి ఉపరితలంపైకి దూసుకొచ్చిన తోకచుక్కల కారణంగానే భూమిపై జీవరాశి ఆవిర్భవించినట్టు వారు తేల్చారు. జీవి నిర్మాణానికి అవసరమైన మౌలిక పదార్ధాలను సృష్టించడానికి అవసరమైన శక్తిని తోకచుక్కలు అందించాయని వారు వివరిస్తున్నారు. నీరు, కార్బన్‌ డై ఆక్సైడ్‌, ఇతర తేలికపాటి అణువులతో తయారైన తోకచుక్క స్పటిక ఢీకొట్టడం వల్ల తలెత్తే పరిణామాన్ని వారు కంప్యూటర్‌ నమూనాలో విశ్లేషించారు. ఈ కారణంగా జీవం ఆవిర్భవించిందని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News