: దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే మోడీకి పట్టం: రాజ్ నాథ్


గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రచార సారథ్యం అప్పగించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. గోవాలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు ప్రసంగం చేస్తూ.. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మోడీని ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించామని వెల్లడించారు. కాంగ్రెస్ పాలన పుణ్యమా అని మాల్దీవుల వంటి చిరు దేశాలు సైతం పొగరుగా తలెగరేస్తున్నాయని, మాట వినకుండా మొండికేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. యూపీఏ తొమ్మిదేళ్ళ పాలనలో సామాన్యుడి జీవితం కుంటుపడిందని, ధరలు మాత్రం ఆకాశానికి ఎగిశాయని ఎద్దేవా చేశారు. ఇక తాము వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఏకిపారేయడంతో పాటు భవిష్యత్ పై స్పష్టమైన అజెండాతో ముందుకుసాగుతామని రాజ్ నాథ్ వివరించారు.

  • Loading...

More Telugu News