: కార్యకర్తలదే ఈ ఘనత: మోడీ
తనను ఈ స్థాయిలో తీర్చిదిద్దిన ఘనత కార్యకర్తలదే అని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితుడైన నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. గోవాలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కార్యకర్తలే భవిష్యత్తు నిర్ధేశకులని అన్నారు. బీజేపీ కార్యకర్తలపై తనకు పూర్తి నమ్మకముందని నొక్కి చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కలలను నిజం చేయాలని కార్యవర్గానికి పిలుపునిచ్చారు. ఇక ప్రచార కమిటీ చైర్మన్ గా నూతన బాధ్యతలప్పగించిన రాజ్ నాథ్ కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.