: కుప్పకూలిన లంక టాపార్డర్


చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో శ్రీలంక ఎదురీదుతోంది. కివీస్ పేసర్ల ధాటికి 65 పరుగులకే టాపార్డర్ ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. సున్నా పరుగుల వద్దే తొలి వికెట్ చేజార్చుకున్న లంక జట్టు ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు కైల్ మిల్స్ , మెక్ క్లీనగన్ లు కొత్తబంతితో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ పనిబట్టారు. వీరిద్దరూ చెరో రెండు వికెట్లతో లంక టాపార్డర్ వెన్ను విరిచారు. ప్రస్తుతం లంక 21 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. సంగక్కర 31 పరుగులతోనూ, తిరిమన్నె ఒక పరుగుతోనూ క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News