: 'చలో అసెంబ్లీ'కి టీఆర్ఎస్ మద్దతు
తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఈ నెల 14న తలపెట్టిన 'చలో అసెంబ్లీ' కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ విషయమై పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, లక్షలాది మందిని హైదరాబాద్ తరలించి 'చలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు. అణచివేత చర్యలతో ఉద్యమాన్ని అడ్డుకోవాలని యత్నిస్తే, తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై నగర పోలీసు కమిషనర్ మరోసారి ఆలోచించుకోవాలని నాయిని అన్నారు. 'చలో అసెంబ్లీ' వంటి కార్యక్రమాలను అనుమతించేది లేదని హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మ నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.