: అద్వానీ పట్ల బీజేపీ తీరుపై దిగ్విజయ్ స్పందన
ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ మొదటిసారి బీజేపీ సీనియర్ నేత అద్వానీకి బాసటగా నిలిచారు. తన హృదయం అద్వానీ వైపే వెళుతోందన్నారు. లోక్ సభలో బీజేపీని 2 సీట్ల నుంచి 182 సీట్లకు తీసుకెళితే, ఆ తర్వాత బీజేపీ అద్వానీతో విభేదిస్తోందంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ గా మోడీని ప్రకటించడాన్ని అద్వానీ వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణంతోనే అద్వానీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 1980లో జన్ సంఘ్ బీజేపీగా అవతరించడంలో వాజ్ పేయి, అద్వానీ కీలకులు.