: కాంగ్రెస్ రహిత దేశం కావాలి: మోడీ
కాంగ్రెస్ పాలనలేని దేశాన్ని ప్రజలు కోరుకుంటున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత నరేంద్రమోడీ అన్నారు. గోవా రాజధాని పనాజీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఆయన ప్రసంగించారు. ప్రజలు కాంగ్రెస్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ రహిత దేశం అనేది రాజకీయం కాదని మోడీ స్పష్టం చేశారు. ఇది జాతీయవాదంతో కూడిన ప్రకటనగా పేర్కొన్నారు. సర్ధార్ పటేల్ విగ్రహం స్వేచ్చ కంటే పెద్దదిగా అభివర్ణించారు.