: బీసీసీఐ ట్రెజరర్ తొలగింపు?


మూడు రోజుల క్రితం నియమితుడైన బీసీసీఐ ట్రెజరర్ తల్లమ్ వెంకటేశ్ పదవి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది! సాంకేతిక కారణాలతో ఆయనను తొలగించినట్టు తెలుస్తోంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)లో పదవి చేపట్టాలంటే కనీసం ఒక్క వార్షిక సమావేశానికైనా హాజరై ఉండాలని నియమావళి చెబుతోంది. అయితే, కర్ణాటక క్రికెట్ సంఘానికి చెందిన వెంకటేశ్ ఈ విషయంలో అనర్హుడిగా తేలడంతో ఆయనకు నిరాశ తప్పలేదు.

అల్లుడి ఫిక్సింగ్ వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో ఎన్. శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరమైన సంగతి తెలిసిందే. అంతకుముందే జగ్దలే, షిర్కేలు కార్యదర్శి, కోశాధికారి పదవులకు రాజీనామా చేయడంతో తాత్కాలిక అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా వారిస్థానంలో సంజయ్ పటేల్, వెంకటేశ్ లను నియమించిన సంగతి తెలిసిందే.

కాగా, రేపు చెన్నైలో జరిగే బీసీసీఐ అత్యవసర సమావేశంలో కొత్త ట్రెజరర్ ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్ మైనర్ వాటాదారు రాజ్ కుంద్రా, శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ వ్యవహారాలను చర్చించనున్నారు. కు

  • Loading...

More Telugu News