: రాన్ బాక్సీ కేసు ఫార్మాకు మేల్కొలుపు: కిరణ్ మజుందార్ షా


రాన్ బాక్సీ కి ఎదురైన అనుభవం భారతీయ ఫార్మా పరిశ్రమకు మేల్కొలుపు లాంటిదని ప్రముఖ పార్మా కంపెనీ బయోకాన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా అన్నారు. దీనిని ఉదాహరణగా తీసుకుని భారతీయ నియంత్రణ విధానాలను మరింత పటిష్ఠం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. భారతీయ ఔషధ పరిశ్రమ మరింత చక్కని వాతావరణంలో పనిచేసేలా నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ లోని తయారీ కేంద్రాలలో మందుల తయారీకి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించి, నకిలీ మందులు తయారు చేసినందుకు అమెరికా ఎఫ్ డీఏ రాన్ బాక్సీపై 50కోట్ల డాలర్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News