: కుట్రతోనే వేటు: ద్వారంపూడి


కుట్రలో భాగంగానే తమపై స్పీకర్ అనర్హత వేటు వేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ పార్టీనేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. ప్రజాసమస్యలపై పోరాడతానని, కుమ్మక్కు రాజకీయాల గురించి ప్రజలకు వివరిస్తానన్నారు. పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా ద్వారంపూడి విమర్శలు గుప్పించారు. ఎండాకాలం రాకముందే బాబు పాదయాత్రకు వీడ్కోలు పలికి ఏసీకి పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల మాత్రం ఎండల్లోనూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారని మెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News