: దేశ రక్షణకు రోబో జవాన్లు


ప్రతీ సైనికుడి ప్రాణం ఎంతో విలువైనది. శత్రువుల నుంచి అనుక్షణం దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేందుకు శక్తివంచన లేకుండా వారు కృషి చేస్తుంటారు. సరిహద్దుల్లో కాల్పులు, యుద్ధ సమయాల్లో ఎంతో మంది జవాన్లను కోల్పోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సైనికుల స్థానంలో భవిష్యత్తులో రోబో జవాన్లను దింపాలని ఆర్మీ భావిస్తోంది.

సరిహద్దుల్లో దేశ భద్రతకు పూచీ ఇవ్వాలంటే ఆ రోబోలు ఎంతో తెలివిగా వ్యవహరించాలి కదా. అలాగే, యుద్ధ సమయాల్లో శత్రువు, మిత్రువుకు మధ్య తేడాను గుర్తించగలగాలి. క్షణంలో స్పందించేలా ఉండాలి. మొత్తానికి రోబో సినిమాలోని చిట్టిలా ఉండాలి. అలాంటి రోబో తయారీ కోసమే రక్షణ శాఖకు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్ డీవో నడుం బిగించింది. ఎంతో తెలివితో కూడిన రోబో సోల్జర్ తయారీ కోసం పనిచేస్తున్నామని డీఆర్ డీవో చీఫ్ అవినాష్ చందర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News