: టీడీపీ ఆందోళనపై స్పందించిన సీఎం కిరణ్


టీడీపీ నేతల ఆందోళన ఫలించింది. ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే. వారిని పోలీసులు అరెస్టు చేసి గోషా మహల్ పోలీసు స్టేషన్ కు తరలించినా.. వారు అక్కడ కూడా ఏపీపీఎస్సీ అక్రమాలపై నినదించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ.. నేడు తమను పోలీసులతో అరెస్టు చేయించినా.. శాసనసభ సమావేశాల్లో సీఎం తమనుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News