: జేఎన్టీయూహెచ్ పరిధిలో వచ్చే ఏడాదీ సెమిస్టర్ లేనట్లే


జేఎన్టీయూ (హైదరాబాద్) పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పద్ధతి అమలు చేసేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు విద్యార్థులకు కొంత సమయమివ్వాలని వాదిస్తున్నారు.

పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వెల్లడి వరకు మొత్తం ప్రయాస భరిత వ్యవహారం కావడమే అధికారుల ఉదాసీన వైఖరికి కారణంగా కనపడుతోంది. దీంతో వచ్చే సంవత్సరం కూడా విద్యార్థులకు సెమిస్టర్ విధానం అందుబాటులోకి రాకుండా పోతోంది. 


జేఎన్టీయూహెచ్ ఎప్పట్లానే వార్షిక పరీక్షల పద్ధతికే మొగ్గు చూపుతుండడంతో... ఒక్కసారిగా బండెడు సిలబస్ చదవలేక మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులు తీవ్ర  ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అదే, సెమిస్టర్ విధానం అమల్లో ఉంటే కనుక ప్రతి ఆరు నెలలకు పరీక్షలు వుంటాయి కాబట్టి, తమ సిలబస్ లో సగభాగం మాత్రమే చదువుకొనే వెసులుబాటు విద్యార్ధులకు లభిస్తుంది. 

అయితే, 2014-2015 విద్యా సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ విధానం ప్రవేశపెడతామని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్ర్రార్ రమణారావు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News