: సీఎం కార్యాలయాన్ని ముట్టడించిన టీడీపీ నేతలు
ఏపీపీఎస్సీలో అక్రమాలపై వినతిపత్రం అందిద్దామంటే అనుమతి నిరాకరించడంపై ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఈ ఉదయం సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. టీడీఎల్పీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరిన టీడీపీ నాయకులు బేగంపేట గ్రీన్ ల్యాండ్స్ లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఏపీపీఎస్పీని తక్షణమే ప్రక్షాళన చేయాలని వారు సీఎంను డిమాండ్ చేశారు.