: ఔరా.. కుక్క పిల్లకూ 'చేప ప్రసాదమా..'!!


ప్రతి ఏడాది మృగశిర కార్తె ఆరంభంలో హైదరాబాద్ కు చెందిన బత్తిన సోదరులు ఉబ్బస వ్యాధి నివారిణి అంటూ చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం తెలిసిందే. కాలానుగుణంగా ప్రభావం చూపించే ఈ శ్వాసకోశ వ్యాధికి మందులు విపరీతంగా వాడి విసుగెత్తిపోయిన రోగులు చివరగా చూసేది బత్తిన బ్రదర్స్ అందించే ఈ చేప ప్రసాదంవైపే. అందుకే ఈ మందుకింత డిమాండ్. ఏదో పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్నట్టు ప్రజలు వెల్లువెత్తడం, వారికి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం పడే హైరానా ప్రతి సంవత్సరం మనం చూస్తుంటాం. అయితే, ఎప్పుడూ లేనిది ఈసారి ప్రత్యేకంగా ఓ వ్యక్తి కుక్క పిల్లకు చేప ప్రసాదం ఇప్పించాడు. కుక్కకు మందు ఎందుకని మీడియా ప్రశ్నిస్తే.. ఉబ్బసం వ్యాధి పీడించకుండా ఉండేందుకని బదులిచ్చాడా వ్యక్తి. పైగా ఆ శునకం గర్భవతి అనికూడా అతగాడు వెల్లడించాడు.

  • Loading...

More Telugu News